logo

మంగళగిరి ప్రజలూ నా కుటుంబ సభ్యులే

మంగళగిరి ప్రజలు తనకు సొంత కుటుంబ సభ్యులతో సమానమని కూటమి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌ అన్నారు. మంగళగిరి మండలం కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తల్లి నారా భువనేశ్వరితో కలసి గురువారం ‘రచ్చబండ’ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Published : 10 May 2024 05:15 IST

నియోజకవర్గంలో పేదరికం లేకుండా చేస్తా
రచ్చబండలో నారా లోకేశ్‌

కురగల్లు రచ్చబండలో మాట్లాడుతున్న లోకేశ్‌, వేదికపై తల్లి భువనేశ్వరి, నందమూరి సుహాసిని

మంగళగిరి, తాడేపల్లి, న్యూస్‌టుడే: మంగళగిరి ప్రజలు తనకు సొంత కుటుంబ సభ్యులతో సమానమని కూటమి తెదేపా అభ్యర్థి నారా లోకేశ్‌ అన్నారు. మంగళగిరి మండలం కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తల్లి నారా భువనేశ్వరితో కలసి గురువారం ‘రచ్చబండ’ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా మురుగుడు హనుమంతరావు, ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఇక్కడి ప్రజలు అవకాశమిచ్చినా చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఆర్కే సినిమాల్లోకి వెళ్లి ఉంటే ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చేదని ఎద్దేవా చేశారు. చెరువు, కొండ పోరంబోకు, అసైన్డ్‌ భూముల్లో నివసిస్తున్నారని, వారందరికీ పట్టాలిస్తామని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో భూగర్బ డ్రైనేజీ పాటు ఇంటింటికీ కృష్ణాజలాలు అందిస్తామన్నారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో మంగళగిరి ఆటోనగర్‌లో ఏర్పాటు చేసిన పైకేర్‌, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో నేడు 580 మంది యువతీ యువకులు పనిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇలాంటి పరిశ్రమలు మరిన్ని తీసుకొస్తానని హమీ ఇచ్చారు. తొలుత మహిళలు ఆయన హారతిపట్టి స్వాగతం పలికారు. నందమూరి సుహాసిని, మండల తెదేపా అధ్యక్షులు తోటా పార్థసారధి, జనసేన నాయకులు ఏడుకొండలు, వెంకట మారుతీరావు, గోపాల్‌, తోటా రామారావు పాల్గొన్నారు.

తండ్రి లాగా విజన్‌ ఉన్న నాయకుడు లోకేశ్‌...

ఇక్కడ పరిస్థితులు చూశాక ఐదేళ్లుగా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమవుతుందని నందమూరి సుహాసిని అన్నారు. కురగల్లు రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే.. వైకాపా ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందని మండిపడ్డారు. లోకేశ్‌ కూడా విజన్‌ ఉన్న నాయకుడని, ఆయన్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారన్నారు.

సమస్యల ఏకరవు :  రాజధాని రైతులకు కౌలు బకాయిలను ఇప్పించాలని, శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని కురగల్లు ప్రజలు కోరారు. టిడ్కో ఇళ్లను సకాలంలో ఇవ్వకపోవడం వల్ల వడ్డీలు, చక్రవడ్డీలు వడ్డీలు భారంగా మారాయి. పరిష్కారం చూపాలని ఓ మహిళ లోకేశ్‌ను కోరారు. నిడమర్రులో వైద్యశాలను పది పడకలకు పెంచాలన్నారు. లోకేశ్‌ స్పందిస్తూ రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేస్తామని, ఆయా సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు