logo

ఎక్స్‌ప్రెస్‌లు రయ్యిరయ్యి ఎంఎంటీఎస్‌లు కుయ్యికుయ్యి

రైలు పట్టాల నిర్వహణ, సిగ్నళ్లు సరి చేయడం.. ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేసే దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులతో బయలుదేరిన బండ్లనూ

Published : 21 Jan 2022 02:11 IST
సీతాఫల్‌మండీలో ఎంఎంటీఎస్‌ అరగంట నిలిచిపోవడంతో వేచి చూస్తున్న ప్రయాణికులు

ఈనాడు, హైదరాబాద్‌: రైలు పట్టాల నిర్వహణ, సిగ్నళ్లు సరి చేయడం.. ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేసే దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులతో బయలుదేరిన బండ్లనూ గమ్యస్థానానికి చేర్చడం లేదు. ఒకదాని తర్వాత ఒకటిగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వెళ్తున్న సమయంలో జంక్షన్ల మధ్యనే ఎంఎంటీఎస్‌ రైళ్లు నిలిపేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాతంలో ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వెళ్లే ఎంఎంటీఎస్‌ను సీతాఫల్‌మండి స్టేషన్‌లో ఆపేశారు. కనీస వివరాలు వెల్లడించకుండా అరగంట పాటు ఆగడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు.

నిరీక్షణ.. 38 ఎంఎంటీఎస్‌ రైలు సర్వీసులను నిర్వహణ పనులు పేరిట బుధ, గురు, శుక్రవారాల్లో రద్దు చేస్తున్నట్టు ద.మ. రైల్వే ప్రకటించింది. ఈ సమాచారాన్ని ఎంఎంటీఎస్‌ స్టేషన్లలోనూ అందుబాటులో ఉంచలేదు. టిక్కెట్‌ కొనుగోలు చేసిన సమయంలోనూ చెప్పలేదు. 120 సర్వీసులు నడుస్తున్నప్పుడు అర గంటకో రైలు ఉండేది. ప్రస్తుతం సర్వీసులు 78కి పరిమితి కావడంతో పాటు ప్రతిసారి కోత విధిస్తుండటంతో ప్రయాణికులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని