logo

పుష్పక్‌ టికెట్‌తో ఇంటివరకూ ప్రయాణం

అంతర్జాతీయ విమానాశ్రయానికి పుష్పక్‌ బస్సుల్లో ప్రయాణించేవారికి టీఎస్‌ఆర్టీసీ సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. విమానాశ్రయం నుంచి నగరంలోని ఇళ్లకు చేరాలనుకునేవారు.. పుష్పక్‌ బస్సులో నిర్దేశిత బస్టాపులో దిగిన తర్వాత ఇంటికి చేరువగా

Published : 25 May 2022 04:32 IST

ఈనాడు, హైదరాబాద్‌: అంతర్జాతీయ విమానాశ్రయానికి పుష్పక్‌ బస్సుల్లో ప్రయాణించేవారికి టీఎస్‌ఆర్టీసీ సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. విమానాశ్రయం నుంచి నగరంలోని ఇళ్లకు చేరాలనుకునేవారు.. పుష్పక్‌ బస్సులో నిర్దేశిత బస్టాపులో దిగిన తర్వాత ఇంటికి చేరువగా వెళ్లేందుకు సిటీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ మంగళవారం ప్రకటించింది. పుష్పక్‌ బస్సుల్లో టికెట్‌ కొన్న తర్వాత 3 గంటల వరకూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని