logo

అబ్దుల్‌ మాజిద్‌ అత్తార్‌ అరెస్ట్‌

ప్రధాని మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగీలపై సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన ఏఐఎంఐఎం(ఇంక్విలాబ్‌) నాయకుడిని మొఘల్‌పురా పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Published : 30 Jun 2022 03:32 IST

చాంద్రాయణగుట్ట: ప్రధాని మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగీలపై సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు పెట్టిన ఏఐఎంఐఎం(ఇంక్విలాబ్‌) నాయకుడిని మొఘల్‌పురా పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ వివరాల ప్రకారం... మైలార్‌దేవుపల్లి నివాసి, ఏఐఎంఐఎం(ఇంక్విలాబ్‌) జాయింట్‌ కన్వీనర్‌ అబ్దుల్‌ మాజిద్‌ అత్తార్‌(54) ఈనెల 25న ఫేస్‌బుక్‌లో ఆరెస్సెస్‌, మోదీ, యోగీలను కించపరిచేలా పోస్టు పెట్టారు. అబ్దుల్‌ మాజిద్‌ అత్తార్‌పై సుమోటోగా కేసు నమోదుచేసిన పోలీసులు, అతడిని బుధవారం అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని