logo

ఈసీఐఎల్‌ను సందర్శించిన ఎన్నికల అధికారులు

హైదరాబాద్‌ కుషాయిగూడలోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌)ను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సందర్శించారు

Published : 03 Jul 2022 03:56 IST

ఈసీఐఎల్‌ అధికారులతో సమావేశమైన కేంద్ర  ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌

కుషాయిగూడ, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ కుషాయిగూడలోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌)ను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సందర్శించారు. ఈవీఎం కన్సల్టెంట్‌ విపిన్‌ కటారీ, ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌, అదనపు ముఖ్య ఎన్నికల అధికారులు మాణ్యికరాజ్‌, బుద్ధా ప్రసాద్‌, డిప్యూటీ ఎన్నికల అధికారి సత్యవాణి శనివారం చర్లపల్లిలోని ఎలక్ట్రానిక్స్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ సర్వీసెస్‌ డివిజన్‌(ఈఎంఎస్‌డీ) ప్లాంటును చూశారు. అందులో తయారవుతున్న ఈవీఎంలు, సాంకేతిక అంశాలను ఈసీఐఎల్‌ సీఎండీ రెయిర్‌ అడ్మిరల్‌(రిటైర్డ్‌) సంజయ్‌ చౌబే కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించారు. రాజీవ్‌కుమార్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఈసీఐఎల్‌కు రావడం ప్రాధాన్యం సంతరించుకొంది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని