logo

బాలికపై సామూహిక అత్యాచారం కేసు.. నిందితుల పాస్‌పోర్టుల స్వాధీనంపై దృష్టి

జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో నిందితుల పాస్‌పోర్టుల స్వాధీనంపై పోలీసులు దృష్టి సారించారు. మే 28న చోటుచేసుకున్న ఈ సంఘటనలో అయిదుగురు మైనర్లతోపాటు...

Published : 06 Aug 2022 01:52 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో నిందితుల పాస్‌పోర్టుల స్వాధీనంపై పోలీసులు దృష్టి సారించారు. మే 28న చోటుచేసుకున్న ఈ సంఘటనలో అయిదుగురు మైనర్లతోపాటు సాదుద్దీన్‌ మాలిక్‌కు సంబంధించిన పాస్‌పోర్టు గురించి జువైనల్‌ కోర్టుతో పాటు 12వ అదనపు ఎంఎస్‌జే కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సీసీఎల్‌-1 మైనరు మినహా మిగిలిన నలుగురు తమ పాస్‌పోర్టులను జువైనల్‌ కోర్టులో జమచేశారు. సీసీఎల్‌-1 గా ఉన్న నిందితుడికి పాస్‌పోర్టు లేదని కుటుంబ సభ్యులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సాదుద్దీన్‌ మాలిక్‌కు ఇటీవల షరతులతో కూడిన బెయిలు లభించింది. పోలీసులు వేసిన పిటిషన్‌ ఆధారంగా అతడు సైతం తన పాస్‌పోర్టును 12వ అదనపు ఎంఎస్‌జే కోర్టులో జమచేయాల్సి ఉంది. నిందితులు దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు పాస్‌పోర్ట్‌ అథారిటీకి పోలీసులు లేఖలు రాశారు. కొందరు నిందితుల తల్లిదండ్రులు తమ పిల్లలను విదేశాలకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారం అసత్యమని పోలీసులు శుక్రవారం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని