logo

శారదా విద్యాలయ శతాబ్ది వేడుకల్లో తెలుగు టైటాన్స్‌

హైదరాబాద్‌లోని శారదా విద్యాలయ శతాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా గురువారం ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకెఎల్‌)లోని తెలుగు టైటాన్స్‌ జట్టు శారదా విద్యాలయను సందర్శించింది.

Published : 01 Dec 2022 19:57 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని శారదా విద్యాలయ శతాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా గురువారం ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకెఎల్‌)లోని తెలుగు టైటాన్స్‌ జట్టు శారదా విద్యాలయను సందర్శించింది.  విద్యార్థులతో ముచ్చటించిన క్రీడాకారులు విద్యార్థులకు కబడ్డీ మెళకువలనూ వెల్లడించారు. విద్యలో క్రీడలు ఓ భాగం చేసుకోవాలని క్రీడాకారులు పట్టుదల, ఏకాగ్రత, వ్యూహరచన వంటివి కబడ్డీ ఆటతో మెరుగవుతాయన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన విద్యాసంస్థను సందర్శించడం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శారదా విద్యాలయ ట్రస్టీ, సింథోకెమ్‌ ల్యాబ్స్‌ ఛైర్మన్‌ శ్రీ జయంత్‌ ఠాగోర్‌,  శారదా విద్యాలయ సెక్రటరీ రామ్‌ మాదిరెడ్డి, కరస్పాండెంట్‌ జ్యోత్స్న అంగారా సైతం  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని