logo

ఎల్లారెడ్డిగూడలో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు.. ముగ్గురికి గాయాలు

అమీర్‌పేట పరిధిలోని ఎల్లారెడ్డిగూడలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.

Published : 06 Dec 2022 13:11 IST

పంజాగుట్ట: అమీర్‌పేట పరిధిలోని ఎల్లారెడ్డిగూడలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిగూడలో జి.నరసింహ అనే వ్యక్తి తాపీమేస్త్రిగా పనిచేస్తున్నారు. ఈరోజు ఉదయం ఆయన గ్యాస్‌స్టౌపై చాయ్‌ పెట్టేందుకు అగ్గిపుల్ల వెలిగించారు. అప్పటికే గ్యాస్‌ లీకై ఉండటంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నరసింహతో పాటు ఆయన భార్య నాగలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. వారి కుమారుడు గణేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. నరసింహ, నాగలక్ష్మిలను అమీర్‌పేటలోని వెల్‌నెస్‌ సెంటర్‌లో చికిత్స నిమిత్తం చేర్పించారు. గణేశ్‌ స్వల్ప గాయాలతో అమీర్‌పేటలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పంజాగుట్ట ఎస్సై ఉపేంద్రబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని