logo

దివ్యాంగులకు ప్రభుత్వం అండ: లలితకుమారి

ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని జిల్లా మహిళా, శిశు సంక్షేమాధికారిణి లలితకుమారి తెలిపారు.

Published : 08 Dec 2022 02:37 IST

దివ్యాంగురాలికి జ్ఞాపికను అందజేస్తున్న డీఆర్‌డీఓ కృష్ణన్‌, డీడబ్ల్యూఓ లలితకుమారి తదితరులు

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని జిల్లా మహిళా, శిశు సంక్షేమాధికారిణి లలితకుమారి తెలిపారు. బుధవారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మద్గుల్‌చిట్టెంపల్లి పంచాయతీ వనరులు కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐక్య రాజ్య సమితి సూచనల మేరకు అంతార్జతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని దివ్యాంగులకు వివిధ రకాలైన ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించామని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించామన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి కృష్ణన్‌ మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రత్యేకంగా స్వయం సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.. నిరుద్యోగ దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఉద్యోగమేళాను నిర్వహించాలన్న ఆలోచన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ అదనపు పీడీ నర్సిములు, శ్రీధర్‌, డీపీఓ రామ్మూర్తి, సీడీపీఓ వెంకటేశ్వరమ్మ, ఎఫ్‌ఆర్‌ఓ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని