logo

ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.66 లక్షలు దోచుకున్నారు

నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకున్న ఓ ముఠా ఆన్‌లైన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని మోసం చేసి, రూ.66 లక్షలు దోచుకున్న సంఘటన జగద్గిరిగుట్ట ఠాణాపరిధిలో జరిగింది. సీఐ సైదులు వివరాల ప్రకారం....వెంకట్రాంరెడ్డినగర్‌కి చెందిన ఎస్‌.సత్యనారాయణ ఉద్యోగ అన్వేషణలో భాగంగా ఓఎల్‌ఎక్స్‌లో వెతుకుతుండగా గత జూన్‌లో వి.సంధ్య, కె.హరీష్‌కుమార్‌ అనే వ్యక్తులు పరిచయమయ్యారు.

Published : 02 Feb 2023 03:21 IST

షాపూర్‌నగర్‌, న్యూస్‌టుడే: నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకున్న ఓ ముఠా ఆన్‌లైన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని మోసం చేసి, రూ.66 లక్షలు దోచుకున్న సంఘటన జగద్గిరిగుట్ట ఠాణాపరిధిలో జరిగింది. సీఐ సైదులు వివరాల ప్రకారం....వెంకట్రాంరెడ్డినగర్‌కి చెందిన ఎస్‌.సత్యనారాయణ ఉద్యోగ అన్వేషణలో భాగంగా ఓఎల్‌ఎక్స్‌లో వెతుకుతుండగా గత జూన్‌లో వి.సంధ్య, కె.హరీష్‌కుమార్‌ అనే వ్యక్తులు పరిచయమయ్యారు. పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో సత్యనారాయణ.. సంధ్య వాట్సప్‌ నంబరుకు బయోడేటా పంపించాడు. ప్రతినెలా రూ. 20 వేల వేతనంతో టెలికాలర్‌ ఉద్యోగానికి ఎంపికైనట్లు చెప్పి అతని బ్యాంక్‌ ఖాతా వివరాలు తీసుకున్నారు. తర్వాత పలువురిని ఉద్యోగాల పేరుతో ఫేక్‌ కాల్‌లెటర్లు పంపుతూ, సత్యనారాయణ ఖాతాకు డబ్బులు తెప్పించుకుని అనంతరం తమ ఫోన్‌పే, బ్యాంకు ఖాతాలకు మార్చుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురి వద్ద విడతల వారీగా మొత్తం రూ. 66,65,010 దోచుకున్నారు. తాజాగా పలు కంపెనీల్లో హెచ్‌ఆర్‌గా ఉద్యోగం వచ్చిందని తప్పుడు కాల్‌లెటర్లు అందుకున్న ఉమామహేశ్వర్‌, రాజేష్‌, అనిల్‌, గిరిధర్‌లు డబ్బులు పంపించిన ఖాతా నంబర్‌ను ఆధారంగా సత్యనారాయణ వద్దకు వెళ్లి విచారించారు. ఖాతా నంబరు మాత్రమే తనదని, ఫేక్‌ కాల్‌లెటర్స్‌తోగానీ, వారు పంపిన డబ్బుతోగానీ తనకు సంబంధం లేదని సత్యనారాయణ వారికి స్పష్టం చేశారు. దీంతో బాధితులు అవాక్కయ్యారు. సంధ్య, హరీష్‌కుమార్‌లు మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన సత్యనారాయణ ఈమేరకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని