రసాయన పరిశ్రమలో ప్రమాదం
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని ‘లీ ఫార్మా పరిశ్రమ’లో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
జిన్నారం ‘లీ ఫార్మా పరిశ్రమ’లోని సాల్వెంట్ నిల్వ కేంద్రంలో ఎగిసిపడుతున్న మంటలు
జిన్నారం, న్యూస్‌టుడే: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని ‘లీ ఫార్మా పరిశ్రమ’లో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం 9.30కు ఆవరణలోని సాల్వెంట్ నిల్వకేంద్రంలో ప్రమాదం నెలకొంది. టోలిన్ రసాయనంతో మధ్యాహ్నం 2 గంటల వరకే నాలుగుసార్లు మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది, పరిశ్రమ వర్గాలు ప్రణాళికతో ముందుకు సాగి సాయంత్రానికి మంటలను అదుపులోకి తెచ్చారు. కర్మాగారాల భద్రతా శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్‌కుమార్ సూచనతో సమీపంలోని మైలాన్, హెటిరో, ఎస్‌ఎంఎస్, దివిస్ తదితర పరిశ్రమల భద్రతా సిబ్బంది సహకరించారు. రసాయనాల ట్యాంకులు, డ్రమ్ములు నిల్వ చేసే యార్డులో రాపిడి, లీకేజీ వల్ల మంటలు అంటుకుని ఉంటాయని సిబ్బంది అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రాణనష్టం లేదని పరిశ్రమ ప్రతినిధి మోహన్‌రావు చెప్పారు. స్వల్పంగా గాయపడిన ఒకరిని పరిశ్రమ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఐడీఏ బొల్లారం సీఐ సురేందర్‌రెడ్డి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై.. సుప్రీంకు 14 విపక్ష పార్టీలు
-
Movies News
manchu manoj: ‘ఇళ్లల్లోకి వచ్చి ఇలా కొడుతుంటారండి’.. వీడియో షేర్ చేసిన మనోజ్
-
World News
WHO Vs Musk: మస్క్ X టెడ్రోస్.. ట్విటర్ వార్..!
-
Politics News
KTR: ఒక్క తెలంగాణలోనే పెట్టుబడికి రూ.10 వేలు.. పంట నష్టపోతే రూ.10 వేలు : కేటీఆర్
-
Politics News
Bandi Sanjay: నాకెలాంటి నోటీసూ అందలేదు.. నేను ఇవాళ రాలేను: సిట్‌కు బండి సంజయ్ లేఖ
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్ ఉత్తరాఖండ్‌లో ఉన్నాడా..? నేపాల్ సరిహద్దుల్లో పోస్టర్లు..