logo

మైనార్టీల రుణ మంజూరు గడువు ఏప్రిల్‌ 20: కలెక్టర్‌

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లబ్ధిదారులకు బకాయి ఉన్న రుణాలను ఏప్రిల్‌ 20 లోగా మంజూరు చేయాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి బ్యాంక్‌ అధికారులను ఆదేశించారు.

Published : 24 Mar 2023 02:44 IST

మాట్లాడుతున్న పాలనాధికారి నారాయణరెడ్డి

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లబ్ధిదారులకు బకాయి ఉన్న రుణాలను ఏప్రిల్‌ 20 లోగా మంజూరు చేయాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి బ్యాంక్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రుణాలు మంజూరు చేయటంలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో అన్ని రంగాలకు కలిపి రుణ మంజూరు లక్ష్యం రూ. 6693.90 కోట్లు కాగా 36 శాతం లక్ష్యం సాధించారని తెలిపారు. జిల్లాలో పంట రుణాల కింద డిసెంబËర్‌ నెల వరకు రూ. 2433.53 కోట్ల లక్ష్యం కాగా 49 శాతం లక్ష్యాన్ని సాధించారన్నారు. ఎల్‌డీఎం రాంబాబు, ఆర్‌బీఐ ఏజీఎం హనుమకుమారి, నాబార్డ్‌ డీడీఎం ప్రవీణ్‌కుమార్‌, జిల్లా అధికారులు యూసుఫ్‌ అలీ, కోటాజీ, వినయ్‌కుమార్‌, చక్రపాణి, బాబుమోజెస్‌, సుధారాణి, నర్సింహులు, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

బ్రిడ్జి పనులకు సహకరించండి

వికారాబాద్‌ రైల్వే బ్రిడ్జి మరమ్మతు, నిర్మాణ పనులను చేపట్టడానికి సహకరించాలని క్రైస్తవ మత గురువులను నారాయణరెడ్డి కోరారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మెథడిస్టు చర్చి కార్య నిర్వాహక బోర్డు సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్‌ నెలలో వర్షాలతోపాటు ఎన్నికల హంగామా మొదలవుతుందని ఈలోపుగా బ్రిడ్జి పనులు ప్రారంభించటానికి సహకరించాలన్నారు. శిక్షణ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌, ఆర్డీవో విజయకుమారి, తహసీల్దారు వాహిద్‌ఖాతూన్‌, రోడ్ల భవనాల శాఖ డీఈ శ్రీధర్‌రెడ్డి, పుర కమిషనర్‌ శరత్‌చంద్ర, చర్చి సభ్యులు స్టీవెన్‌, జాన్‌ విక్టర్‌, సంజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని