logo

మాజీ సైనికోద్యోగుల జాబ్‌మేళాకు విశేష స్పందన

డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ రీసెటిల్‌మెంట్‌(డీజీఆర్‌), కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌(సీఐఐ) సంయుక్తంగా హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన జాబ్‌ మేళాకు విశేష స్పందన లభించింది.

Published : 29 Mar 2023 02:09 IST

జ్యోతి వెలిగించి మేళా ప్రారంభిస్తున్న ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ పీకే ఘోష్‌

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ రీసెటిల్‌మెంట్‌(డీజీఆర్‌), కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌(సీఐఐ) సంయుక్తంగా హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన జాబ్‌ మేళాకు విశేష స్పందన లభించింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైమానిక దళం ఎస్‌ఓఏ ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ పీకే ఘోష్‌ హాజరై మేళాను ప్రారంభించినట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. త్రివిధ దళాల్లో పదవీవిరమణ పొందనున్న, పొందిన అధికారులు, ఉద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ మేళా నిర్వహించారు. 50 వివిధ కార్పొరేట్‌ సంస్థలు పాల్గొని ఎంపికప్రక్రియ చేపట్టగా.. ఇందులో 1241 మంది మాజీ సైనికుద్యోగులు పాల్గొన్నారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని