logo

మనిషిని మనిషిగా గౌరవించడమే సనాతన ధర్మం

మనిషిని మనిషిగా గౌరవించడమే సనాతన ధర్మమని ఆంద్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి పేర్కొన్నారు. సనాతన ధర్మ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని టివోలీ గార్డెన్‌లో గురువారం జరిగిన శ్రీ రామ నవమి ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, ఈ మేరకు మాట్లాడారు.

Published : 31 Mar 2023 02:44 IST

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి

మాట్లాడుతున్న జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి

కార్ఖానా, న్యూస్‌టుడే: మనిషిని మనిషిగా గౌరవించడమే సనాతన ధర్మమని ఆంద్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తి పేర్కొన్నారు. సనాతన ధర్మ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని టివోలీ గార్డెన్‌లో గురువారం జరిగిన శ్రీ రామ నవమి ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, ఈ మేరకు మాట్లాడారు. ఈ సందర్భంగా రచయిత్రి, విద్యావేత్త డాక్టర్‌ అమృతలత, హిందీ అధ్యాపకుడు తంగిరాల రాజేంద్ర ప్రసాద్‌, అధ్యాపకురాలు నందివాడ అనంతలక్ష్మిలను ట్రస్ట్‌ నిర్వాహకులు రాజ్‌ కందుకూరితో కలిసి ఆయన అవార్డులు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్‌ సభ్యులు ఎల్వీ సుబ్రమణ్యం, మురళి, కృష్ణ, గోపాలరెడ్డి, రాజేశ్వరీ, బసవరాజు, ఆనంద్‌కందుకూరి, డా.ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని