పిట్టగోడ కూలి బాలుడి మృతి.. ఇద్దరికి గాయాలు
ఓ ఇంటి పిట్టగోడ ప్రమాదవశాత్తు కూలి ఓ బాలుడు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. కూకట్‌పల్లి పోలీసుల కథనం ప్రకారం.. మూసాపేట ప్రగతినగర్‌లో ఓ ఇంటి పిట్టగోడ శిథిలావస్థకు చేరింది.
గౌతం మృతదేహం
కూకట్‌పల్లి, న్యూస్‌టుడే: ఓ ఇంటి పిట్టగోడ ప్రమాదవశాత్తు కూలి ఓ బాలుడు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. కూకట్‌పల్లి పోలీసుల కథనం ప్రకారం.. మూసాపేట ప్రగతినగర్‌లో ఓ ఇంటి పిట్టగోడ శిథిలావస్థకు చేరింది. శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో పక్క ఇంట్లో ఉండే అక్కాతమ్ముడు లక్ష్మి(9), గౌతం(3) ఆ ఇంటి వద్ద ఆడుకుంటున్నారు. అదే సమయంలో ఇంటి పిట్టగోడ ఓ వైపు కూలి సరిగ్గా పిల్లలపై పడింది. గౌతం తలకు తీవ్ర గాయాలవ్వగా, లక్ష్మికి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అప్పుడే అటుగా వెళ్తున్న ఇదే ప్రాంతంలో ఉండే ప్రకాశ్(25) కాలికి గాయమైంది. బాధితులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గౌతం చికిత్స పొందుతూ మృతి చెందాడు. 25 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు కావడంతో పిట్టగోడ శిథిలమై కూలి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Nara Brahmani: నారా బ్రాహ్మణితో సమావేశమైన జనసేన నేతలు
-
Sanju Samson: సంజూ శాంసన్ ఆ వైఖరిని మార్చుకోవాలి: శ్రీశాంత్
-
Hyderabad: సెల్ఫోన్ పోయిందని.. యువకుడి ఆత్మహత్య
-
S Jaishankar: జీ20 సారథ్యం ఆషామాషీ కాదు.. పెను సవాళ్లను ఎదుర్కొన్నాం: జైశంకర్
-
అవకాశం దొరికిన ప్రతిసారీ బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డాడు: దిల్లీ పోలీసులు