logo

Hyderabad - Covid 19: నిలోఫర్‌లో చిన్నారికి కొవిడ్‌

నిలోఫర్‌ ఆసుపత్రిలో మొదటి కొవిడ్‌ కేసు నమోదైంది. నాలుగైదు రోజుల క్రితం తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతూ..

Updated : 22 Dec 2023 07:35 IST

రెడ్‌హిల్స్‌: నిలోఫర్‌ ఆసుపత్రిలో మొదటి కొవిడ్‌ కేసు నమోదైంది. నాలుగైదు రోజుల క్రితం తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతూ.. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 14 నెలల చిన్నారిని వెంటిలేటర్‌పై తీసుకొచ్చారు. అనంతరం చికిత్స మొదలుపెట్టారు. అనుమానం వచ్చి కొవిడ్‌ పరీక్ష చేయగా ‘పాజిటివ్‌’గా నిర్ధారణ అయింది. చిన్నారికి ‘నిలోఫర్‌’ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం కుదుటపడిందని, వెంటిలేటర్‌ను తొలగించి ప్రస్తుతం ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందుతోందని ఆసుపత్రి వైద్యాధికారి ప్రొ.శ్రీనివాస్‌ కల్యాణి తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని