logo

ముందుకు సాగని నకిలీ సీఐడీ అధికారుల కేసు

నకిలీ సీఐడీ అధికారులమంటూ ఓ ఐటీ సంస్థ కార్యాలయంపై దాడి చేసిన ముఠాకు సహకారం అందించిన కీలక నిందితుడు, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన ఎస్‌ఐ ఇంకా పరారీలోనే ఉన్నాడు.

Published : 28 Mar 2024 02:49 IST

రాయదుర్గం, న్యూస్‌టుడే: నకిలీ సీఐడీ అధికారులమంటూ ఓ ఐటీ సంస్థ కార్యాలయంపై దాడి చేసిన ముఠాకు సహకారం అందించిన కీలక నిందితుడు, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన ఎస్‌ఐ ఇంకా పరారీలోనే ఉన్నాడు. జనవరి 26న అర్ధరాత్రి గచ్చిబౌలిలోని అజా(ఏజేఏ) సంస్థపై ఐటీ నిపుణుడు, ఏపీలోని సీఐడీ సైబర్‌ క్రైం విభాగంలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం చేసి మానేసిన అబ్దుల్‌ ఖదీర్‌, మహేందర్‌, సందీప్‌కుమార్‌, రఘురాజు, రాజాలు ఏపీ సీఐడీ అధికారులమంటూ దాడిచేసిన విషయం తెలిసిందే. ఆ సంస్థ అమెరికా క్లైంట్ల విషయంలో అవతవకలకు పాల్పడుతున్నట్లు బెదిరించి, రూ.10కోట్లు డిమాండ్‌ చేసి రూ.2.3 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారు. సంస్థ ఉద్యోగులు ముగ్గురిని కిడ్నాప్‌ చేసి నిర్బంధించి వారినుంచి రూ.12.5లక్షలు కాజేసి పారిపోయారు. సూత్రధారులు అజాలో పనిచేసి మానేసిన రంజిత్‌కుమార్‌, మహేందర్‌లకు ఖదీర్‌ను పరిచయం చేయడం, దాడి పథక రచనలో కర్నూలు రేంజి కార్యాలయ ఎస్‌ఐ సుజన్‌ కీలకంగా నిలిచాడు. అదేనెల 28న ముఠాలోని పది మందిలో 8మందిని రాయదుర్గం పోలీసులు అరెస్టుచేయగా ఎస్‌ఐ సుజన్‌, రాజా చిక్కలేదు. ఇంకా గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని