logo

‘డిజిటల్‌ బ్యాంకింగ్‌’తో ఆర్థిక లావాదేవీలు సులభం

డిజిటల్‌ బ్యాంకింగ్‌ విధానంతో ఆర్థిక లావాదేవీలతోపాటు పెట్టుబడులు, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ మరింత సులభతరమవుతుందని వక్తలు పేర్కొన్నారు.

Published : 28 Mar 2024 03:24 IST

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న అతిథులు

కాచిగూడ, న్యూస్‌టుడే: డిజిటల్‌ బ్యాంకింగ్‌ విధానంతో ఆర్థిక లావాదేవీలతోపాటు పెట్టుబడులు, ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ మరింత సులభతరమవుతుందని వక్తలు పేర్కొన్నారు. బుధవారం కాచిగూడలోని బద్రుకా వాణిజ్య కళాశాలలో.. ‘డిజిటల్‌ ఫైనాన్స్‌: స్థిరమైన అభివృద్ధి కోసం వ్యూహం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఓయూ వాణిజ్య విభాగాధిపతి ప్రొ.చెన్నప్ప, కంపెనీ సెక్రటరీ పాల్వాయి విక్రమ్‌రెడ్డి, ఆర్‌బీసీ విశ్రాంత ఎండీ ఖాజా సుధాకర్‌, ఓయూ విశ్రాంత ఫ్యాకల్టీ డీన్‌లు ప్రొ.కేవీ అచలపతి, ఎస్‌వీ సత్యనారాయణ, నాబార్డ్‌ విశ్రాంత చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్‌రావు,  సీవీ రజని మాట్లాడారు. బద్రుకా కార్యదర్శి శ్రీకిషన్‌ బద్రుకా, డైరెక్టర్‌ జనరల్‌ ప్రొ.అభిరామకృష్ణ, ప్రిన్సిపల్‌ డా.మోహన్‌కుమార్‌, సదస్సు కన్వీనర్‌ డా.జానకీరామ్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ డా.వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని