logo

కొడంగల్‌ వృద్ధితోనే.. ఉపాధి అవకాశాలు సమృద్ధి: టీఆర్‌ఆర్‌

‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఆ ప్రభావం పరిగి, తాండూర్‌, పాలమూరు మీద పడి అవి కూడా పురోగమించి మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని’ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పరిగి శాసన సభ్యులు రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

Published : 29 Mar 2024 03:28 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌. వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి, గురునాథ్‌ రెడ్డి, పాలమూరు పార్లమెంటు అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డి

కొడంగల్‌, న్యూస్‌టుడే: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఆ ప్రభావం పరిగి, తాండూర్‌, పాలమూరు మీద పడి అవి కూడా పురోగమించి మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని’ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పరిగి శాసన సభ్యులు రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం కొడంగల్‌ విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఆయన ఇంట్లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీన్లో ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌ పాల్గొని మాట్లాడారు. ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి కావడంతో ఇక్కడ పరిశ్రమలు పెరిగి, ఉపాధి అవకాశాలు ఎక్కువగా వస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ ఉన్నందున ఎలాంటి అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదని, కోడ్‌ ముగిసిన వెంటనే శరవేగంగా పనులు ప్రారంభం అవుతాయన్నారు.

పాలమూరుపై గత పాలకుల పగ: వంశీచంద్‌ రెడ్డి

అనంతరం పాలమూరు పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌ రెడి మాట్లాడుతూ గత పాలకులు పాలమూరుపై పగపెట్టుకొని నిర్లక్ష్యానికి గురిచేశారన్నారు.గతం ఎలా ఉన్నా కొడంగల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడు నెలలకే రూ.5వేల కోట్లు తీసుకు వచ్చి అభివృద్ధికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి పోటీలో ఉన్నారని భావించి కార్యకర్తలు గట్టిగా పనిచేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాండూర్‌ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ పోలీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గురునాథ్‌రెడ్డి, ఎంపీపీ ముద్దప్ప, ఎండి.యూసుఫ్‌, నందారం ప్రశాంత్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని