logo

బిస్కెట్‌ తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం

కాటేదాన్‌ పారిశ్రామికవాడలోని పహల్‌ఫుడ్‌ బిస్కెట్‌ పరిశ్రమలో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, పరిశ్రమ మేనేజర్‌ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 29 Mar 2024 03:36 IST

12 గంటల శ్రమించాక అదుపులోకి..

మంటల్లో పరిశ్రమ భవనం

కాటేదాన్‌, న్యూస్‌టుడే: కాటేదాన్‌ పారిశ్రామికవాడలోని పహల్‌ఫుడ్‌ బిస్కెట్‌ పరిశ్రమలో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, పరిశ్రమ మేనేజర్‌ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. పహల్‌ఫుడ్‌ బిస్కెట్‌ పరిశ్రమ మూడో అంతస్తులో తెల్లవారుజామున నాలుగున్నరకు ఒక్కసారిగా మంటలు రావడంతో మొదటి అంతస్తులో పనిచేస్తున్న వందమందికిపైగా కార్మికులు ఉరుకులు పరుగులతో రోడ్డుపైకివచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. వెంటనే సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నారు. పది ఫైరింజిన్లతో 12 గంటలు శ్రమించి మంటలను ఆర్పివేశారు. తెల్లవారుజామున నాలుగున్నరకు ప్రారంభమైన మంటలు సాయంత్రం నాలుగున్నరకు అదుపులోకి వచ్చాయి. బిస్కెట్‌ ప్యాకెట్‌ కవర్ల గోదాముతో పాటు లక్షల విలువైన యంత్రాలు, ఇతర సామగ్రి కాలి బూడిదయ్యాయి. పైరెండంతస్తుల పిల్లర్లు కుప్పకూలాయి. రాజేందర్‌కుమార్‌ అగర్వాల్‌కు చెందిన ఈ పరిశ్రమలో నిత్యం పగలు వెయ్యిమందికి పైగా కార్మికులు పని చేస్తారు. రాత్రి వంద మందే పనిచేస్తుండడం, మొదటి అంతస్తులోనే ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పరిశ్రమలో మిస్కర్‌ నుంచి సరకు యంత్రంలోకెళ్లి బిస్కెట్‌లుగా మారి కన్వెల్డ్‌ బెల్ట్‌ మీదుగా బయటకు వస్తుంటాయి. అక్కడి ఆపరేటర్‌, కార్మికులు నిద్రలోకి వెళ్లడంతో సరకంతా ఒక్కచోటే పేరుకుపోయింది. దీంతోనే విద్యుదాఘాతంతో మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. రూ.కోట్లలో ఆస్తినష్టం జరిగి ఉంటుందని పోలీసులు, పరిశ్రమ నిర్వహకులు తెలిపారు. పరిశ్రమ మేనేజర్‌ ఫిర్యాదు చేసినట్లు రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌, మైలార్‌దేవుపల్లి ఎస్సై రజాక్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని