logo

జూబ్లీహిల్స్‌ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర

జూబ్లీహిల్స్‌ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ ఆరోపించారు.

Published : 18 Apr 2024 04:07 IST

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ ఆరోపణ

 ఈనాడు, నిజామాబాద్‌: జూబ్లీహిల్స్‌ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ ఆరోపించారు. నేరం ఒప్పుకోవాలని తన కొడుకుని ఒత్తిడి చేస్తున్నారని.. ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరించారన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. పంజాగుట్ట ఠాణా పరిధిలో బారికేడ్లను ఢీకొట్టిన కేసులో వేధించడంతో పాటు ఘటన జరిగినప్పుడు దుబాయిలో ఉన్న తన పేరు కూడా చేర్చారన్నారు. తన కొడుకు తప్పు చేస్తే ఉరితీయాలని.. కానీ ఇప్పటికే ట్రయల్‌ నడుస్తున్న కేసులో ప్రమేయం లేకున్నా ఇరికించడం సరికాదన్నారు. పారదర్శకంగా విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కేసును సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. తన కుమారుడికి ఏమైనా జరిగితే వెస్ట్‌జోన్‌ డీసీపీ, ఇతర పోలీసు అధికారులే బాధ్యులవుతారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని