logo

చేవెళ్ల.. అభిమానం నిలువెల్లా

చేవెళ్ల లోక్‌సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి లింగంపల్లి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 03 May 2024 03:44 IST

చేవెళ్ల లోక్‌సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి లింగంపల్లి ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నల్లగండ్ల, హుడా ట్రేడ్‌ సెంటర్‌, పాత ఎంఐజీ కాలనీ పార్కుల్లో వాకర్స్‌ను కలుసుకున్నారు.


ఒవైసీ.. నేనే గెలిచేసి..

ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి బరిలో ఉన్న ఆయన మలక్‌పేట ఎమ్మెల్యే బలాలతో కలిసి సైదాబాద్‌లో పర్యటించారు.


పల్లె ఓటర్ల వద్దకు పట్నం

మల్కాజిగిరి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీత కీసరలో రోడ్‌షోలో పాల్గొన్నారు. తొలుత రెబల్‌ గళం వినిపించిన మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ తదితరులు ఆమెకు మద్దతుగా నిలిచారు.


నివేదిత.. ఓటు నివేదన

రసూల్‌పుర ఇందిరమ్మ నగర్‌లో కంటోన్మెంట్‌ అసెంబ్లీ భారాస అభ్యర్థి నివేదిత విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆమె సోదరి మరణంతో వచ్చిన ఉపఎన్నికలో ఆమె పోటీ చేస్తున్నారు.


కొత్తూరులో పొత్తు నేతలు

పొత్తు కారణంగా సీపీఐ నేతలు కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారు. మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా కొత్తూరు మున్సిపాలిటీలో కరపత్రాలు పంపిణీ చేశారు.


బాణం వేస్తా.. ఓట్లు పట్టేస్తా

ఎన్నికల ప్రచారానికి  వెళ్లిన హైదరాబాద్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి కొంపెల్ల మాధవీలతకు గౌలిగూడలో ఘన స్వాగతం లభించింది. కార్యకర్తలు అభిమానంతో పూల బాణం, కిరీటం, గజమాల అందించి సత్కరించారు.  


గడ్డం పట్టుకు బతిమాలుతున్నా.. ఓటేయరూ

హైదరాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ ఆబిడ్స్‌, మురళీధర్‌బాగ్‌, ఎంజే మార్కెట్‌, కట్టెలమండీ ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. మహిళలతో ముచ్చటించి ఓటేయాలని కోరారు.


ఓటేయాలి కాదనకుండ

సికింద్రాబాద్‌ లోక్‌సభ నుంచి బరిలో ఉన్న విముక్త చిరుతల కక్షి (వీసీకే) పార్టీ అభ్యర్థి శ్యామ్‌ను గెలిపించాలంటూ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ తోల్‌ తిరుమావళవన్‌ బాగ్‌లింగంపల్లిలో రోడ్‌ షో నిర్వహించారు.


సీపీఎం.. సూటిగా సుత్తి లేకుండా

భువనగిరి లోక్‌సభ నుంచి సీపీఎం తరఫున బరిలో ఉన్న మహమ్మద్‌ జహంగీర్‌ మంచాల మండలం ఆరుట్ల చౌరస్తాలో రోడ్‌ షో నిర్వహించారు. తనను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని