logo

ఆనాటి బరిలో ఇద్దరే

లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నపుడు పలు పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 40మంది కంటే ఎక్కువగా బరిలో ఉంటున్నారు. కానీ 1957 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి కేవలం ఇద్దరు అభ్యర్థులే బరిలో నిలిచారు.

Updated : 05 May 2024 06:22 IST

లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నపుడు పలు పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 40మంది కంటే ఎక్కువగా బరిలో ఉంటున్నారు. కానీ 1957 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి కేవలం ఇద్దరు అభ్యర్థులే బరిలో నిలిచారు. కాంగ్రెస్‌, ప్రజా సోషలిస్టు పార్టీ అభ్యర్థులు పోటీ చేయగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 3,41,797 మంది ఓటర్లు ఉండగా.. 1,47,258 (43.1శాతం) మంది ఓటేశారు. పోలైన ఓట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి అహ్మద్‌ మొహియుద్దీన్‌కి 98,203, ప్రజా సోషలిస్టు పార్టీ అభ్యర్థి ఎస్‌.బి.గిరికి 49,055 ఓట్లు వచ్చాయి.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని