logo

‘ఆఫ్టర్‌ 9’.. అశ్లీల నృత్యాలు

వివిధ రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి అశ్లీల నృత్యాలు నృత్యాలు చేయిస్తున్న పబ్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి పెద్ద సంఖ్యలో యువతులు, కస్టమర్లు, పబ్‌ సంబంధీకులు కలిపి 172 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Published : 06 May 2024 05:50 IST

పబ్‌లో 172 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

బంజారాహిల్స్‌లోని పబ్‌

జూబ్లీహిల్స్‌: వివిధ రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి అశ్లీల నృత్యాలు నృత్యాలు చేయిస్తున్న పబ్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి పెద్ద సంఖ్యలో యువతులు, కస్టమర్లు, పబ్‌ సంబంధీకులు కలిపి 172 మందిని అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ కమిషనర్‌ రష్మీ పెరుమాల్‌ ఆదివారం  ప్రకటనలో వివరాలు వెల్లడించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 14లోని ఆఫ్టర్‌ 9 పబ్‌లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారనే సమాచారంతో పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శనివారం అర్ధరాత్రి తరువాత దాడి చేశారు. 32 మంది యువతులు, 131 మంది కస్టమర్లను గుర్తించారు. యువతులను నియమించుకొని అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. యువతులు, కస్టమర్లతో పాటు నిర్వాహకుడైన బర్ని సతీష్‌, పబ్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు, క్యాషియర్‌ ఎ.శ్రీనివాసరావు, డీజే ఆపరేటర్‌ అజ్మత్‌ఖాన్‌, బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు.మాదకద్రవ్యాలు ఉపయోగిస్తున్నారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ ఈ పబ్‌పై అనేక ఫిర్యాదులున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని