logo

అగ్రనేతల తాకిడి.. రాజధానిలో సందడి

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు గడువు దగ్గరపడటంతో రాజధాని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలను అన్ని పార్టీల అగ్రనేతలు చుట్టేస్తున్నారు.

Updated : 06 May 2024 05:36 IST

ఈనాడు- సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు గడువు దగ్గరపడటంతో రాజధాని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలను అన్ని పార్టీల అగ్రనేతలు చుట్టేస్తున్నారు. వచ్చే శనివారం వరకు వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలు దాదాపు 20 మంది రాజధానికి రానుండడంతో ప్రచారం తారాస్థాయికి చేరనుంది.

రేవంత్‌.. ప్రియాంక.. రాహుల్‌.. కాంగ్రెస్‌ పార్టీ చివరి విడత ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేయనున్నారు. ఉదయం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో.. సాయంత్రం  రాజధానిలో రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహిస్తున్నారు. ప్రచారం చివరి దశకుచేరడంతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఈ నెల 9న సరూర్‌నగర్‌లో జరిగే  సభలో పాల్గొననున్నారు. ఈనెల 10న కాంగ్రెస్‌ నేత ప్రియాంకాగాంధీ సభ ఉండగా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

ఈనెల 10న ప్రధాని మోదీ.. భాజపా తరఫున ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖమంత్రి అమిత్‌షా రోడ్‌షోలు నిర్వహించారు. ప్రధాని మోదీ ఈనెల 10న ఎల్బీ స్టేడియంలో జరిగే సభకు రానున్నారు. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌తో పాటు మరికొందరు ఈనెల 8 తరువాత ప్రచారం చేపట్టనున్నారు.

బస్సుయాత్ర ముగియగానే.. మాజీ సీఎం కేసీఆర్‌ బస్సు యాత్ర ముగిసిన తరువాత ఈనెల 11న నగరంలో భారీ సభను నిర్వహించడంపై పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని