logo

తమిళిసైపై ఎన్నికల కమిషన్‌కు భారాస ఫిర్యాదు

మాజీ గవర్నర్‌ తమిళిసైపై భారాస ప్రధాన కార్యదర్శి ప్రొ.ఎం.శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు చేశారు.

Published : 09 May 2024 02:09 IST

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: మాజీ గవర్నర్‌ తమిళిసైపై భారాస ప్రధాన కార్యదర్శి ప్రొ.ఎం.శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి జి.కిషన్‌రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే కాలనీలో ప్రచారం చేస్తూ ఓటర్లకు అయోధ్య రామమందిర నమూనాలు పంపిణీ చేసి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్నారు. కిషన్‌రెడ్డిని అనర్హులుగా ప్రకటించి తమిళిసై ప్రచారం చేయకుండా డీబార్‌ చేయాలని కోరినట్లు తెలిపారు. అయితే తమిళిసై తమ కుటుంబ సన్నిహితురాలని, మంగళవారం ఇంటికి వస్తే తెలిసిన వారికి మందిర నమూనాలు బహుమతిగా ఇచ్చామని భాజపా నాయకురాలు పాదూరి కరుణ వెల్లడించారు. కిషన్‌రెడ్డికి ప్రచారం చేయలేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని