logo

అమ్మ ప్రేమ అనిర్వచనీయం

మన సంస్కృతిలో అమ్మకే తొలి ప్రాధాన్యమని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కేవీ రమణాచారి అన్నారు. అభినందన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో  అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు.

Published : 15 May 2024 01:58 IST

సత్యవాణికి పురస్కారం ప్రదానం చేస్తున్న కేవీ రమణాచారి, చిత్రంలో ఓలేటి పార్వతీశం

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: మన సంస్కృతిలో అమ్మకే తొలి ప్రాధాన్యమని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కేవీ రమణాచారి అన్నారు. అభినందన సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో  అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. అమ్మ ప్రేమ అనిర్వచనీయమైనదని, కొలమానం లేదని పేర్కొన్నారు. ప్రతిరోజు అమ్మను ప్రేమించడం మన సంస్కృతి అని సాహితీవేత్త ఓలేటి పార్వతీశం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవాణికి అభినందన భవాని మాతృమూర్తి మాదిరాజు వరలక్ష్మి పురస్కారాన్ని ప్రదానం చేసి సన్మానించారు. డి.కుసుమ, ఎం.సుగుణలను మాతృవందనం పేరిట సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖులు డీవీ మోహనకృష్ణ, కేవీ కృష్ణకుమారి, ఇ.భవాని, విజయానందకృష్ణ, వసుంధరాదేవి, ఇందిరావిజయ్‌, ధనుంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని