logo
Published : 28/11/2021 02:59 IST

ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన పెంపు

సమావేశంలో పాల్గొన్న పాలనాధికారిణి సంగీత, ఇతర అధికారులు

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఈ యాసంగిలో జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా సాగు చేసే పంటలపై రైతుల్లో అవగాహన కల్పించాలని పాలనాధికారిణి డాక్టర్‌ సర్వే సంగీత సత్యనారాయణ సూచించారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నిర్వహించిన దూరదృశ్య మాధ్యమంలో నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలనాధికారిణి మాట్లాడుతూ రైతువేదికల ద్వారా వాతావరణ, ఇతర పరిస్థితులపై అవగాహన కల్పించాలన్నారు. నిబంధనల ప్రకారం వానాకాలం ధాన్యం కొనుగోలుపై అధికారులు పర్యవేక్షణ పెంచాలని సూచించారు. యాసంగి ధాన్యంలో సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) లక్ష్యాలను చేరుకోవాలన్నారు. సమావేశంలో అదనపు పాలనాధికారి లక్ష్మీనారాయణ, డీసీపీ రవీందర్‌, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల్‌ప్రసాద్‌, మార్కెటింగ్‌ అధికారి ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని