logo
Published : 28/11/2021 02:59 IST

ఉల్లాసంగా.. ఉత్సాహంగా

బొమ్మకల్‌(కరీంనగర్‌ గ్రామీణం), న్యూస్‌టుడే: వృత్తులన్నింటిలో వైద్య వృత్తి ఎంతో అద్భుతమైందని, అలాంటి వృత్తిని సాధించడానికి ప్రతి విద్యార్థి పట్టుదలతో కృషి చేయాలని బసవతారకం ఇండో అమెరికన్‌ ఆస్పత్రి డైరెక్టర్‌, క్యాన్సర్‌ సర్జన్‌ డాక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరరావు అన్నారు. కరీంనగర్‌, బొమ్మకల్‌లోని చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థ కళాశాల 18వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళాశాల ఛైర్మన్‌ చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ.. కొవిడ్‌ సమయంలో ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, చేసిన సేవలు అమోఘమన్నారు. కళాశాల టాపర్‌ పి.లాలిత్యకు ముఖ్య అతిథి సుబ్రహ్మణ్యేశ్వరరావు, లక్ష్మీనరసింహారావు చేతుల మీదుగా బంగారు పతకం, ప్రశంసాపత్రం, చల్మెడ విమలాదేవి మెమోరియల్‌ తరఫున రూ.50 వేల చెక్కును అందజేశారు. విద్యార్థుల నృత్యాలు అలరించాయి. కళాశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఆసిమ్‌అలీ, వైస్‌ప్రిన్సిపల్‌ డాక్టర్‌ అనిత, నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ పద్మ పాల్గొన్నారు.

జ్యోతి వెలిగిస్తున్న డాక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరరావు

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని