logo
Published : 30/11/2021 03:21 IST

రాష్ట్రాన్ని భాజపా పాలించే రోజులు రావాలి

సమ్మక్కదేవతకు పూలదండ వేస్తున్న ఈటల రాజేందర్‌

తాడ్వాయి, న్యూస్‌టుడే: రాష్ట్రాన్ని భాజపా పాలించే రోజులు రావాలని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతృత్వం పోవాలని సమ్మక్క, సారలమ్మలను వేడుకొన్నట్లు మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన నేపథ్యంలో సోమవారం ఆయన వనదేవతలను దర్శించుకున్నారు. ఎత్తుబెల్లం, పసుపు కుంకుమ, పూలు పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించి దేవతలకు పూజలు చేశారు. ఆలయ పూజారులు శాలువాలతో సన్మానించి దేవతల వస్త్రాలు, ప్రసాదాన్ని బహూకరించారు. మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, భాజపా జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కొండూరు నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని