logo
Published : 03/12/2021 02:38 IST

డిజిటల్‌ చెల్లింపులు భళా

 జిల్లాలో నాలుగు లక్షలకు పైగా స్కానర్లు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ సంక్షేమ విభాగం

మార్కెట్‌లో పండ్ల బండి వద్ద స్కానర్‌

ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎదైనా కొనుగోలు చేయాలంటే డబ్బులు తప్పనిసరి. జేబులో పర్సు లేదంటే ఇక అంతే సంగతులు. ఇప్పుడు అలాంటి వాటికి ఇబ్బంది పడాల్సిన పని లేదు. కూరగాయలు, పండ్లు, సరకులు, రోజువారి అవసరాలకు డిజిటల్‌ చెల్లింపులు పెరిగిపోయాయి. అందుకు సంబంధించి దుకాణదారులు స్కానర్లు అందుబాటులో ఉంచుతున్నారు. గతంలో చాలామందికి బ్యాంకుఖాతాలు ఉండేవి కాదు. దాదాపుగా ఇప్పుడు ప్రతి ఒక్కరో ఏదో బ్యాంకులో ఖాతా తీస్తున్నారు. డిజిటల్‌ ఇండియాలో భాగంగా చాలామందికి బ్యాంకులు జీరోబ్యాలెన్స్‌తో కూడిన ఖాతాలు, ప్రభుత్వం అందజేస్తున్న వివిధ సంక్షేమ పథకాలన్నీంటికి బ్యాంకు ఖాతాలను ముడిపెట్టడంతో చాలామంది కొత్తగా ఖాతాలు తెరుస్తున్నారు. అనంతరం డిజిటల్‌ చెల్లింపుల కోసం వారికి ఇష్టమైన యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకొని లావాదేవీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అన్ని రకాల డిజిటల్‌ లావాదేవీలకు సంబంధించి చిన్నచిన్న వ్యాపారులతో కలుపుకొని పెద్ద వ్యాపారుల వరకు సుమారుగా నాలుగు లక్షల స్కానర్లను ఏర్పాటు చేశారు. వీటిద్వారా కొనుగోలుదారులు చెల్లింపులు చేస్తున్నారు. ఫోన్‌ చేతిలో ఉండి బ్యాంకులో బ్యాలెన్సు ఉంటే ఎటువంటి చెల్లింపులైనా చేసేసదుపాయం నేడు ఉంది. పల్లె, పట్టణం తేడా లేకుండా డిజిటల్‌ చెల్లింపులు పెరుగుతున్నాయి.
చిల్లరతో ఇబ్బంది లేదు:  అంజయ్య, పండ్ల వ్యాపారం
కొనుగోలుదారులు వచ్చి కావాల్సిన పండ్లను తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో చిల్లరతో ఇబ్బంది ఉండేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులేమీ లేవు. వారికి కావాల్సిన పండ్లను తీసుకొని ధర చెప్పగానే డిజిటల్‌ చెల్లింపు చేస్తున్నారు. రెండు సంవత్సరాల నుంచి డిజిటల్‌ చెల్లింపుల సదుపాయాన్ని వినియోగించుకుంటున్నా. ఎలాంటి ఇబ్బంది లేదు.
అన్ని రకాలుగా సదుపాయం
రాకేశ్‌, యువకుడు

విద్యుత్తు బిల్లులు, చరవాణి రీఛార్జీలు, కూరగాయల కొనుగోలు, షాపింగ్‌, సినిమాకి వెళ్లిన సమయంలో డిజిటల్‌ చెల్లింపులనే వినియోగిస్తున్నాం. ఈ కాలంలో నగదు జేబులో పెట్టుకొని తిరగాల్సిన పనిలేదు. చరవాణి చేతిలో ఉంటే అవసరమైన అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయవచ్చు.
అధికమంది డిజిటల్‌ చెల్లింపులే
ప్రేమ్‌కుమార్‌, వ్యాపారి

మార్కెట్‌లో మొబైల్‌ దుకాణం ఉంది. ఎక్కువశాతం డిజిటల్‌ చెల్లింపులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. వందమందిలో ఒకరో ఇద్దరు నగదు ఇస్తున్నారు. మిగతా మొత్తం డిజిటల్‌ చెల్లింపులే. మేము ఇతరులకి చేసే చెల్లింపులను ఆన్‌లైన్‌లో యాప్‌లద్వారా చేస్తున్నాం.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని