logo

గని మార్గం.. నిర్వహణపై నిర్లక్ష్యం

సెంటినరీకాలనీ-గోదావరిఖని మధ్యన కోల్‌కారిడార్‌ మార్గంలో ప్రయాణించడమంటేనే వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు. సింగరేణి ఆర్జీ-2, 3 యాజమాన్యాలు పట్టించుకోకపోవటంతో రహదారి అధ్వానంగా మారింది

Published : 09 Dec 2021 05:24 IST

మలుపు వద్ద సూచిక బోర్డు దుస్థితి

సెంటినరీకాలనీ-గోదావరిఖని మధ్యన కోల్‌కారిడార్‌ మార్గంలో ప్రయాణించడమంటేనే వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు. సింగరేణి ఆర్జీ-2, 3 యాజమాన్యాలు పట్టించుకోకపోవటంతో రహదారి అధ్వానంగా మారింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, సింగరేణి యాజమాన్యం సంయుక్త ఆధ్వర్యంలో అయిదేళ్ల కిందట రూ.37.21 కోట్లతో కాలనీ నుంచి ఖని ఫైవింక్లయిన్‌ కూడలి వరకు 16 కి.మీ.ల మేర రెండు వరుసల బీటీ రోడ్డు నిర్మించింది. అప్పటి నుంచి వార్షిక మరమ్మతులు లేక అడుగడుగునా గుంతలు పడ్డాయి. ఇరువైపులా పెరిగిన ముళ్ల చెట్లను ఎప్పటికప్పుడు తొలగించడం లేదు. సూచిక బోర్డులపై చెట్ల కొమ్మలు పెరగటంతో రాత్రి వేళల్లో మలుపులు కనిపించక చోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వేగ నియంత్రణకు ట్రాఫిక్‌ పోలీసులు ఏర్పాటు చేసిన బోర్డులు ముళ్లచెట్ల పాలయ్యాయి. సౌర విద్యుత్తు ప్లాంటు కేబుళ్ల కోసం బొక్కలవాగు సమీపంలో తవ్విన కందకాన్ని సరిగా పూడ్చకపోవడం ప్రమాదకరంగా మారింది. తెబొగకాసం నాయకుల విన్నపంతో ఆర్జీ-3 సివిల్‌ అధికారులు ఇరువైపులా ముళ్లచెట్ల తొలగింపు పనులు చేపట్టినా పూర్తి స్థాయిలో తొలగించలేదు.

-న్యూస్‌టుడే, సెంటినరీకాలనీ

రహదారికి అడ్డుగా పెరిగిన ముళ్ల చెట్లు

సౌర విద్యుత్తు ప్లాంటు గేటు వద్ద ప్రమాదకరంగా కందకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని