logo

వేసవి దృష్ట్యా అప్రమత్తత అవసరం

వేసవి దృష్ట్యా చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అన్నారు.

Published : 21 Mar 2023 06:16 IST

కరీంనగర్‌ కలెక్టరేట్‌: వేసవి దృష్ట్యా చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎండ తీవ్రతపై వివిధ శాఖల వారీగా చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై ఆయన సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహించాలన్నారు. చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, మున్సిపాలిటీ, ట్రాఫిక్‌ పోలీసు సిబ్బందికి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. తాగునీటి సమస్య ఎదురైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. అంతకుముందు జిల్లా స్థాయి వక్ఫ్‌ ప్రొటెక్షన్‌ సమావేశాన్ని కలెక్టర్‌ నిర్వహించారు. అదనపు పాలనాధికారి గరిమ అగ్రవాల్‌, శిక్షణ కలెక్టర్‌ లెనిన్‌, మైనారిటీ సంక్షేమాధికారి మధుసూదన్‌, సహాయ కమిషనర్‌ చంద్రశేఖర్‌, భూ కొలతల కార్యాలయ ఏడీ అశోక్‌, జిల్లా వైద్యాధికారి జువేరియా, ఇతర అధికారులు పాల్గొన్నారు.


కంటి వెలుగుపై సమీక్ష

కరీంనగర్‌ కలెక్టరేట్‌: జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పల్లెప్రగతి, కంటి వెలుగు, హరితహారం, ఉపాధిహామీ పథకాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. డీఆర్డీవో ఎల్‌.శ్రీలత, డీపీవో వీరబుచ్చయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని