logo

మండుతున్న ఎండ

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 31.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కావటంతో అన్ని ప్రాంతాల్లోనూ వేడిమి, ఉక్కపోత వాతావరణం ఒక్కసారిగా పెరిగింది.

Updated : 27 Mar 2024 05:50 IST

పలు ప్రాంతాల్లో  40 డిగ్రీలు నమోదు

 

నిర్మానుష్యంగా కరీంనగర్‌ రహదారులు

న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌ క్యాంపు: ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటగా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 31.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కావటంతో అన్ని ప్రాంతాల్లోనూ వేడిమి, ఉక్కపోత వాతావరణం ఒక్కసారిగా పెరిగింది. రాగల రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

 బోసిపోతున్న రహదారులు

ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుండటంతో జనం అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. దీంతో మధ్యాహ్నం సమయంలో రహదారులు జనం లేక బోసిపోతున్నాయి. తప్పనిసరై బయటకు వచ్చినవారు కూడా తలకు టవళ్లు, స్కార్ఫ్‌లు చుట్టుకుని జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జనం రాకపోకలు తగ్గుతున్నాయి.

వైద్యుల సూచనలు

  • రాగల రోజుల్లో గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశమున్నందున ఎండ వేడిమి నుంచి రక్షణకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
  •  ఉదయం  11 గంటల్లోపు సాయంత్రం 4 గంటల తరువాతే ప్రయాణం చేయాలి.
  •  ఎండకు చెమట వల్ల శరీరంలోని నీటిశాతం తగ్గి వడదెబ్బకు గురవుతారు. మంచినీటిని ఎక్కువగా తాగాలి. మజ్జిగ, కొబ్బరినీరు వంటివి తీసుకోవడం వల్ల చెమట ద్వారా బయటకు వెళ్లే లవణాలు మళ్లీ భర్తీ చేసుకోవచ్చు.  
  • వేపుళ్లు, బయటి తిండికి దూరంగా ఉండాలి.
  • నీటి శాతం ఎక్కువ ఉన్న పళ్లు తీసుకోవాలి.
  •  తప్పనిసరై ఎండలోకి వెళుతున్నపుడు తలపై టోపీ లేదా తువాలును ధరించాలి.
  •  వడగాలులు ముక్కు, చెవుల్లోకి వెళ్లకుండా అచ్ఛాదనలు తప్పనిసరి.
  •  ఎండ ప్రభావం చిన్నపిల్లలు, వృద్ధులపై అధికంగా ఉంటుంది. ఎండకు వెళ్లినవారు వాంతులు, విరేచనాలు, కళ్లు తిరిగి పడిపోవటం వంటివాటికి గురవుతారు. వడదెబ్బకు గురైనట్లుగా అనుమానం వస్తే సదరు వ్యక్తిని వెంటనే చల్లటి నీడ ప్రదేశానికి తీసుకెళ్లాలి. తడి గుడ్డతో తుడవాలి. కాస్త సేదతీరిన తరువాత ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని