logo

‘పసుపు బోర్డు పేరుతో మోసం’

పసుపు బోర్డు పేరుతో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ రైతులను మోసం చేశారని కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కూడా మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Updated : 20 Apr 2024 06:17 IST

మాక్లూర్‌లో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి

మాక్లూర్‌, న్యూస్‌టుడే: పసుపు బోర్డు పేరుతో ఎంపీ ధర్మపురి అర్వింద్‌ రైతులను మోసం చేశారని కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కూడా మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాక్లూర్‌లో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న భాజపాకు మద్దతిస్తారా? లేక ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్న కాంగ్రెస్‌ను గెలిపిస్తారో తేల్చుకోవాలని అన్నదాతలకు సూచించారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన ప్రగతిని వివరించారు. తాను విజయం సాధిస్తే ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. మాక్లూర్‌ మండలాన్ని దత్తత తీసుకుంటానని పేర్కొన్నారు. బోధన్‌ శాసనసభ్యుడు సుదర్శన్‌రెడ్డి, ఆర్మూర్‌ ఇన్‌ఛార్జి వినయ్‌రెడ్డి మాట్లాడుతూ..భారాస, భాజపాల వైఫల్యాలను ఎండగట్టాలని కార్యకర్తలను కోరారు. ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలకు చెప్పాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలిత, సీనియర్‌ నాయకులు తాహెర్‌బిన్‌ హందాన్‌, మార చంద్రమోహన్‌, రవిప్రకాష్‌, డేగ పోశెట్టి, గంగాధర్‌గౌడ్‌, వెంకటేశ్వర్‌రావు, దయాకర్‌రావు, రాజేందర్‌, భరత్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని