logo

ఆర్‌ఎం కార్యాలయానికి ఆరుగురు ఉద్యోగుల సరెండర్‌

హుజూరాబాద్‌ ఆర్టీసీ డిపోనకు చెందిన ఆరుగురు ఉద్యోగులను కరీంనగర్‌ ఆర్‌ఎం కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్థానిక డిపోలో పనిచేసే డ్రైవర్‌ రవీందర్‌ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ డిపో మేనేజర్‌ శ్రీకాంత్‌ ఈ నెల 15న అనిశా అధికారులకు చిక్కిన విషయం విదితమే.

Published : 20 Apr 2024 05:03 IST

హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఆర్టీసీ డిపోనకు చెందిన ఆరుగురు ఉద్యోగులను కరీంనగర్‌ ఆర్‌ఎం కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్థానిక డిపోలో పనిచేసే డ్రైవర్‌ రవీందర్‌ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ డిపో మేనేజర్‌ శ్రీకాంత్‌ ఈ నెల 15న అనిశా అధికారులకు చిక్కిన విషయం విదితమే. దీంతో అతడిని సస్పెండ్‌ చేయడంతోపాటు పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆదేశించారు. డిపో మేనేజర్‌ వ్యవహారశైలి, తదితరాలపై డిప్యూటీ ఆర్‌ఎం భూపతిరెడ్డి విచారణ జరిపి నివేదిక సమర్పించారు. డీఎం శ్రీకాంత్‌కు సహకరించిన ఉద్యోగులు వెంకటయ్య, రాజమణి, సురేందర్‌, జాఫర్‌, రవీందర్‌, స్వామిలను ఆర్‌ఎం కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ కరీంనగర్‌ ఆర్‌ఎం సుచరిత ఉత్తర్వులు జారీ చేశారు. హుస్నాబాద్‌ డిపో మేనేజర్‌ సీహెచ్‌ వెంకటేశ్వర్లుకు ఇక్కడ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు.

వ్యయ ఫిర్యాదులకు పరిశీలకులను సంప్రదించండి

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎన్నికల వ్యయ ఫిర్యాదులపై సూచనలు, సలహాలకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల వ్యయ పరిశీలకులను సంప్రదించవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్‌ ఎన్నికల వ్యయ పరిశీలకుడు అశ్వినీకుమార్‌ పాండేకు మొబైల్‌ 90326 59531 ద్వారా సంబంధిత అంశాలపై ఫిర్యాదులు చేయవచ్చన్నారు. కలెక్టర్‌ ఛాంబర్‌లో పాలనాధికారిని అశ్వినీకుమార్‌ పాండే శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని