logo

రాజీ మార్గమే రాజ మార్గం

రాజీ మార్గమే రాజ మార్గమని సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రసాద్‌ అన్నారు. జగిత్యాల కోర్టులో 43 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆస్తి వివాదానికి గురువారం రాజీ మార్గం ద్వారా పరిష్కారం లభించింది.

Published : 03 May 2024 03:09 IST

న్యాయవాదులతో సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రసాద్‌

జగిత్యాలవిద్యానగర్‌, న్యూస్‌టుడే: రాజీ మార్గమే రాజ మార్గమని సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రసాద్‌ అన్నారు. జగిత్యాల కోర్టులో 43 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆస్తి వివాదానికి గురువారం రాజీ మార్గం ద్వారా పరిష్కారం లభించింది. జగిత్యాల పట్టణానికి చెందిన రుద్రంగి నర్సయ్య తన తండ్రి స్థిర, చర ఆస్తుల పంపకం విషయంలో సోదరులు రుద్రంగి రాజన్న, రుద్రంగి విశ్వనాథంతో వివాదం ఏర్పడింది. 1981లో వివాదం మొదలవగా జగిత్యాలలో ఏర్పాటైన కోర్టుకు బదిలీ అయింది. సోదరులు రుద్రంగి రాజన్న, రుద్రంగి విశ్వనాథం వివాదం కొనసాగుతుండగా మృతి చెందారు. సోదరుల వారసులతో రాజీ కుదుర్చుకోగా నరసయ్య పక్షాన మెట్ట మహేందర్‌, రాజన్న పక్షాన సుబ్రహ్మణ్యం, విశ్వనాథం పక్షాన మురళీధర్‌రావు న్యాయవాదులు వాదించగా, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.ప్రసాద్‌ సమక్షంలో రాజీ కుదిరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని