logo

రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయం

రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ పార్టీ ధ్యేయమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శనివారం వేములవాడ గ్రామీణ మండలం బొల్లారం, లింగంపల్లి, హన్మాజీపేట, మర్రిపల్లి, నాగాయ్యపల్లి, పోశెట్టిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 05 May 2024 04:47 IST

బొల్లారంలో మాట్లాడుతున్న విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే: రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ పార్టీ ధ్యేయమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శనివారం వేములవాడ గ్రామీణ మండలం బొల్లారం, లింగంపల్లి, హన్మాజీపేట, మర్రిపల్లి, నాగాయ్యపల్లి, పోశెట్టిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగున్నర నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పధకాలను అమలు చేసిందని, అలాగే దేశంలో అధికారంలోకి వస్తే రాహుల్‌ గాంధీ నాయకత్వంలో పాంచ్‌ న్యాయ్‌ పేరిట పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించనున్నట్లు చెప్పారు. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ ఎత్తివేత, రైతుల కోసం శాశ్వత రుణమాఫీ కమిషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పంటల బీమా సొమ్ము 30 రోజుల్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడంతోపాటు ఎగుమతి దిగుమతుల విధానాలను కొత్తవి అమలు చేయనున్నట్లు తెలిపారు. భారాస ప్రభుత్వ హయాంలో రైతులు కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ చూశారని, ప్రస్తుత కేంద్రాల్లో తేడా చూస్తున్నారన్నారు. కరీంనగర్‌ ఎంపీగా రాజేందర్‌రావును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్‌, రంగు వెంకటేశం, సంఘ స్వామి, సామ తిరుపతి రెడ్డి, చెన్నాడి శ్యామల తదితరులు పాల్గొన్నారు.

చందుర్తి: చందుర్తి మండలంలోని మూడపల్లి, మర్రిగడ్డ, జోగాపూర్‌, బండపల్లి, ఎన్గల్‌ గ్రామాల్లో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ శనివారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సీటు రాదని తెలిసి కేసీఆర్‌ బస్సు యాత్ర చేపడుతున్నారని ఆరోపించారు. భాజపా దేశ సంపదను అదాని, అంబానిలకు దోచి పెడుతుందన్నారు. చందుర్తి మండలం ఎన్గల్‌ మాజీ సర్పంచి లింగంపల్లి సత్తయ్య స్థానికులతో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని