logo

ఆదరిస్తే యువతకు ఉపాధి చూపిస్తా

నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ రంగ పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తెలిపారు.

Published : 09 May 2024 04:51 IST

కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ రంగ పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తానని పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తెలిపారు. పెద్దపల్లిలో బుధవారం ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే విజయరమణారావు, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం ఇప్పిస్తామన్న భారాస, ఏడాదిలో కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన భాజపాలు దొందు దొందేనని ఎద్దేవా చేశారు.

గోదావరిఖని: కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తే ఆదాయ పన్ను మినహాయింపునకు కృషి చేస్తామని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ వెల్లడించారు. స్థానిక సింగరేణి భద్రత సిబ్బంది విభాగం వద్ద బుధవారం ఉదయం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. గోదావరిఖనిలోని ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన సీపీఎం విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. భారాస, భాజపాలకు గుణపాఠం చెప్పాలన్నారు. నగర మేయర్‌ అనిల్‌కుమార్‌, సీపీఎం నాయకులు గోపాల్‌, యాకయ్య, రాజారెడ్డి, ముత్యంరావు, మహేశ్వరి  తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని