logo

నీటికుక్కల వీక్షణకు టవర్ల ఏర్పాటు

బళ్లారి, విజయనగర, కొప్పళ జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలోని నీటి కుక్కల (ఓటర్స్‌) వీక్షణకు నదీ తీరంలో అటవీశాఖ అధికారులు వాచ్‌టవర్ల నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారు. తుంగభద్ర జలాశయం నుంచి కంప్లి వరకూ సుమారు 30 కిలోమీటర్ల నదితీరాన్ని అటవీశాఖ నీటికుక్కల సంరక్షణ ప్రాంతంగా

Published : 24 Feb 2022 01:21 IST


హొసపేటె - కంప్లి మధ్య ప్రవహిస్తున్న తుంగభద్ర నది

హొసపేటె, న్యూస్‌టుడే : బళ్లారి, విజయనగర, కొప్పళ జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలోని నీటి కుక్కల (ఓటర్స్‌) వీక్షణకు నదీ తీరంలో అటవీశాఖ అధికారులు వాచ్‌టవర్ల నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారు. తుంగభద్ర జలాశయం నుంచి కంప్లి వరకూ సుమారు 30 కిలోమీటర్ల నదితీరాన్ని అటవీశాఖ నీటికుక్కల సంరక్షణ ప్రాంతంగా ప్రకటించింది. రాష్ట్రంలో నీటికుక్కలు ఉంటున్న ప్రాంతం ఇదొక్కటే కావడం విశేషం. చేపలను తినే ఈ జంతువులు నదిలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు అటవీశాఖ, పర్యావరణ నిపుణులు చేపట్టిన క్షేత్ర పరిశీలనలో తెలిసింది. ఐదేళ్లక్రితం దీన్ని నీటికుక్కల సంరక్షణ ప్రాంతంగా ప్రకటించినా, ఇప్పటివరకూ ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. ప్రస్తుతం నదీ తీరంలో అక్కడక్కడా వాచ్‌టవర్లు నిర్మించే ప్రతిపాదన అటవీశాఖ ముందుంది. తుంగభద్ర నది ప్రపంచ వారసత్వ ప్రాంతం హంపీలో కూడా పారుతుంది. అక్కడ వాచ్‌టవర్లు నిర్మించాలంటే హంపీ అభివృద్ధి ప్రాధికార, పురావస్తుశాఖల అనుమతి తప్పనిసరి. ఇప్పటికే సంబంధిత శాఖల వారికి అనుమతి కోరుతూ ఉత్తరం రాశామని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. డీపీఆర్‌ సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించామని అధికారులు వివరించారు. చలికాలం మొదలు, వేసవి వచ్చేవరకూ నీటికుక్కలు నదిలో స్వేచ్ఛగా విహరిస్తాయి. ఆ సమయంలో వాటి కదలికలు చూసేందుకు అవకాశం దొరుకుతుంది. ఈ నేపథ్యంలో బుక్కసాగర, హొసపేటె, కంప్లి, హంపీ ప్రాంతాల్లో నది తీరంలో నీటి కుక్కల వీక్షణకు టవర్లను నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని