logo

ఫిబ్రవరిలో ఆనెగుంది ఉత్సవం

ఆనెగుంది ఉత్సవాలను ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు గంగావతి శాసనసభ్యుడు పరణ్న మునవళ్ళి తెలిపారు

Published : 21 Jan 2023 02:52 IST

తిరుమలాపురలో సముదాయ భవనానికి శంకుస్థాపన చేస్తున్న శాసనసభ్యుడు పరణ్ణ

గంగావతి,న్యూస్‌టుడే: ఆనెగుంది ఉత్సవాలను ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు గంగావతి శాసనసభ్యుడు పరణ్న మునవళ్ళి తెలిపారు. ఆయన శుక్రవారం తిరుమలాపురలో రూ.5లక్షలతో నిర్మిస్తున్న సముదాయ భవనానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. హంపీ ఉత్సవాల అనంతరం ఆనెగుంది ఉత్సవం నిర్వహించాలని  తీర్మానించినట్లు చెప్పారు. అంజనాద్రి రహదారి వెడల్పు పనులకు ప్రభుత్వం రూ.246కోట్లు మంజూరు చేసిందన్నారు. హిట్నాళ క్రాస్‌ నుంచి గంగావతి సాయిబాబా ఆలయం దాకా రెండు వరుసల రహదారిని నిర్మిస్తారన్నారు. కరెమ్మగడ్డ, విరుపాపురగడ్డ వాసులకు త్వరలో హక్కుపత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ సభ్యుడు సిద్దరామస్వామి, న్యాయవాది హనుమేశ్‌ యాదవ్‌, హనుమంతయ్య, గాంధిబాబు, పంచాయితీ అధ్యక్షురాలు దురుగమ్మ, ఉపాధ్యక్షుడు షేర్‌ఖాన్‌, సభ్యులు సంతోషమ్మ నాగేశ్‌ పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని