logo

ఒప్పంద కార్మికుల నిరసన

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఒప్పంద కార్మికుల కోసం విశ్రాంత ఐఏఎస్‌ అధికారి శ్రీనివాసాచారి ఇచ్చిన నివేదికలోని సిఫార్సులు అమలు చేయాలంటూ ఉద్యోగులు, ఒప్పంద కార్మికులు సోమవారం ఆందోళనకు దిగారు.

Published : 07 Feb 2023 01:48 IST

స్వాతంత్య్ర ఉద్యానవనంలో ఆందోళనకు దిగిన సిబ్బంది నినాదాలు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఒప్పంద కార్మికుల కోసం విశ్రాంత ఐఏఎస్‌ అధికారి శ్రీనివాసాచారి ఇచ్చిన నివేదికలోని సిఫార్సులు అమలు చేయాలంటూ ఉద్యోగులు, ఒప్పంద కార్మికులు సోమవారం ఆందోళనకు దిగారు. బెంగళూరు స్వాతంత్య్ర ఉద్యానవనంలో ధర్నా చేశారు. సమాన పనికి సమానవేతనం, ఉద్యోగ భద్రతకు చర్యలు తీసుకోవాలంటూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన పొరుగుసేవలు, ఒప్పంద కార్మికులు నినదించారు. సీనియారిటీ ఆధారంగా ఒప్పంద కార్మికులు, పొరుగు సేవల సిబ్బందికి ముందుగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. శ్రీనివాసాచారి నివేదిక ఇచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా, ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని వారంతా ఆక్రోశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని