logo

వైభవంగా కాడసిద్ధేశ్వర రథోత్సవం

తెక్కెలకోటలో కాడసిద్ధేశ్వర రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వారిని ప్రత్యేకంగా వెండి ఆభరణాలు, పూలతో అలంకరించి, అభిషేకాలు కొనసాగాయి.

Published : 24 Mar 2023 04:04 IST

వేడుకల్లో పాల్గొన్న భక్తులు

సిరుగుప్ప, న్యూస్‌టుడే : తెక్కెలకోటలో కాడసిద్ధేశ్వర రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వారిని ప్రత్యేకంగా వెండి ఆభరణాలు, పూలతో అలంకరించి, అభిషేకాలు కొనసాగాయి. మేళతాళాలతో ఉయ్యాలలో ఉత్సవమూర్తిని ఊరేగించారు. సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. తెక్కెలకోటతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తాయమ్మ దేవి ఉత్సవం

సిరుగుప్ప: తాయమ్మ దేవి ఉత్సవాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణ శివారుల్లోని ఆదోని రహదారిపై ఉన్న ఆలయంలో బుధవారం ఉదయం అమ్మవారిని వెండి ఆభరణాలు, పూలతో అలంకరించి, పూజలు, అభిషేకాలు చేశారు. సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. సిరుగుప్ప పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల భక్తులు ఉత్సవంలో పాల్గొన్నారు.

సణ్ణక్కి వీరభద్రేశ్వర రథోత్సవం..

హొసపేటె: సణ్ణక్కి వీరభద్రేశ్వర స్వామి రథోత్సవాన్ని గురువారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. నెహ్రూ కాలనీలో నిర్వహించిన రథోత్సవం సందర్భంగా పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఉగాది పండుగ మరుసటి రోజున రథోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయం నుంచి వాల్మీకి కూడలి ప్రధాన రహదారి వరకు భక్తులు రథాన్ని లాగారు. శుక్రవారం ఉదయం ఆలయ ఆవరణలో కడుబిన కాళగ ధార్మిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులకు స్థానిక యువక సంఘాల ప్రతినిధులు మజ్జిగ పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని