logo

Karnataka Results : తొమ్మిదోసారీ.. ఆయనే

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఆర్‌.వి.దేశ్‌పాండే (76) తొమ్మిదోసారి విధానసభ ఎన్నికల్లో విజయం సాధించి.. చరిత్ర సృష్టించారు.

Updated : 14 May 2023 07:40 IST

ఆర్‌.వి.దేశ్‌పాండె

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఆర్‌.వి.దేశ్‌పాండే (76) తొమ్మిదోసారి విధానసభ ఎన్నికల్లో విజయం సాధించి.. చరిత్ర సృష్టించారు. ఆయన హళియాళ విధానసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విధానసౌధ బాటపట్టారు. 1976 నుంచి ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తొలినాళ్లలో సహకార మహామండలి అధ్యక్షుడిగా పని చేశారు. రామకృష్ణహెగ్డే నేతృత్వంలో 1980లో జరిగిన ఎన్నికల్లో జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి.. నేటి వరకు ఓటమి ఎరగకుండా విజయం సాధిస్తున్నారు. ప్రాథమిక విద్య, రెవెన్యూ, భారీ పరిశ్రమలు, ఆరోగ్యం తదితర శాఖలను నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు విధానసభకు మల్లికార్జున ఖర్గే, ధరంసింగ్‌ ఎన్నికయ్యారు. వారి జాబితాలో ఆర్‌.వి.దేశ్‌పాండే చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని