logo

నేహా హత్య కేసులో పురోగతి

నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్‌, ఎస్‌పీ వెంకటేశ్‌ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్‌ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు.

Updated : 26 Apr 2024 02:39 IST

నేహా తల్లిదండ్రులను పరామర్శిస్తున్న సిద్ధరామయ్య, పాటిల్‌

హుబ్బళ్లి, న్యూస్‌టుడే : నేహా హిరేమఠ కేసు దర్యాప్తును సీవోడీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఆ విభాగం ఏడీజీపీ బీకే సింగ్‌, ఎస్‌పీ వెంకటేశ్‌ నేతృత్వంలోని అధికారులు నేహా తల్లిదండ్రులు గీత, నిరంజన్‌ను గంటన్నరకుపైగా ప్రశ్నించారు. నిందితుని విషయం నేహా ఇంట్లో ఎప్పుడైనా చెప్పిందా? 19న హత్యకు గురయ్యే ముందు ఆమె ప్రవర్తనలో ఏదైనా మార్పు కనిపించిందా? తదితర ప్రశ్నలను అడిగారు. నిందితుడ్ని ఇప్పటికే హత్యాస్థలానికి తీసుకువెళ్లి పోలీసులు మహాజరు చేశారు. నేహా, మహ్మద్‌ ఫయాజ్‌ స్నేహితులనూ అవసరం మేరకు విచారిస్తామని బీకే సింగ్‌ తెలిపారు.

దర్యాప్తు వేగవంతం..

బీదర్‌: హుబ్బళ్లిలో విద్యార్థిని నేహా హిరేమఠ హత్య కేసులో సీవోడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేసినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. కళాశాలలో జరిగిన హత్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. నిందితునికి కఠిన శిక్షను విధించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బీదర్‌లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. భాజపా డిమాండ్‌ చేస్తున్నట్లు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదన్నారు. భాజపా అధికారంలో ఉన్నప్పుడు ఏ కేసునైనా సీబీఐకి అప్పగించిందా అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి గురవారమే హుబ్బళ్లిలో నేహా ఇంటికి చేరుకుని.. ఆమె తల్లిదండ్రులు గీత, నిరంజన్‌తో చర్చించారు. వారికి ధైర్యం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. ధైర్యాన్ని కోల్పోవద్దని ఊరడించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి హెచ్‌.కె.పాటిల్‌, స్థానిక నాయకులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని