logo

ఊరి నిండా ప్రాణదాతలే!

అన్ని దానాల్లోకీ రక్తదానం, అన్నదానం, విద్యాదానం గొప్పవి. హావేరి జిల్లా సవణూరు తాలూకాలోని జల్లాపుర గ్రామాన్ని రక్తదాతల గ్రామం అనే పిలుస్తారు.

Published : 09 May 2024 06:40 IST

 రక్తదాతల గ్రామం జల్లాపుర...

హావేరి, న్యూస్‌టుడే : అన్ని దానాల్లోకీ రక్తదానం, అన్నదానం, విద్యాదానం గొప్పవి. హావేరి జిల్లా సవణూరు తాలూకాలోని జల్లాపుర గ్రామాన్ని రక్తదాతల గ్రామం అనే పిలుస్తారు. ప్రతి ఇంట్లో కనీసం ఇద్దరు దాతలైనా ఉంటారు. కొందరు 25, 50 సార్లు రక్తదానం చేశారు. స్థానికుడు కరెబసప్ప వందసార్లకు పైగా రక్తదానం చేసి, ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఈ ఊళ్లో మొత్తం 520 ఇళ్లు ఉన్నాయి. ఈ గ్రామానికి చెందిన కొందరు రోడ్డు ప్రమాదాల బారిన పడి, సకాలంలో రక్తం లభించక ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి సమయంలో గర్భిణులు, ఇతర వ్యాధుల బారినపడిన వారు రక్తం కోసం ఇబ్బంది ఎదుర్కొన్నారు. స్థానిక యువకులు ‘జీవదాతల బృందం’ పేరిట సంఘాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రతి వీధి, ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్ల గోడలపై నేత్రదానం, అవయవదానం, రక్తదానానికి సంబంధించిన నినాదాలే ఉంటాయి. రక్తదానం, ఇతర దానాలతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని గ్రామ పంచాయతి సభ్యుడు సతీశ్‌ గవళి తెలిపారు. ఇప్పుడు ప్రతి నివాసంలో పది సార్లకు పైగా ఎక్కువ సార్లు రక్తదానం చేసిన యువకులు ఉన్నారని చెప్పారు. క్రమం తప్పకుండా గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తే ప్రతిసారీ 200 యూనిట్ల రక్తం సేకరణ అవుతోంది. అలా సేకరించిన రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తున్నామని సతీశ్‌ చెప్పారు. తమ గ్రామం చుట్టుపక్కల ఉన్న వారిని కూడా రక్తదానం చేయాలని ఆహ్వానిస్తూ వస్తున్నామని స్థానికదాత కరెబసప్ప తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని