logo
Published : 04/12/2021 15:42 IST

TS News: తహసీల్దారు దూషించాడంటూ వ్యక్తి ఆత్మహత్యాయత్నం!

చర్ల: తహసీల్దారు దుర్భాషలాడి తనను దూషించాడంటూ ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. లింగాపురం గ్రామానికి చెందిన కాకర్ల ఆదినారాయణ కుమారుడు బాబి పది రోజుల కిందట అక్రమంగా ఇసుక తరలిస్తుండటంతో అధికారులు ట్రాక్టర్‌ను పట్టుకొని తహసీల్దారు కార్యాలయానికి తరలించారు. అప్పటి నుంచి ట్రాక్టర్‌ విడుదల చేయాలంటూ ఆదినారాయణ పలుమార్లు తహసీల్దారు నాగేశ్వరరావుకు విన్నవించుకున్నారు. ఈ విషయమై శుక్రవారం మరోసారి తహసీల్దారు నాగేశ్వరరావును కలిసి ట్రాక్టర్‌ విషయం అడగ్గా.. ఆయన ఆదినారాయణ పట్ల దురుసుగా ప్రవర్తించి అసభ్యకరంగా దూషించాడు. దీంతో అతడు మనస్తాపానికి గురై శనివారం ఉదయం ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై రాజు వర్మ ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఘటనకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ డివిజనల్‌ అధ్యక్షుడు నల్లపు దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున స్థానికులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఘటనపై విచారణకు ఆదేశించారు.

Read latest Khammam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని