logo

‘రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం’

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేయాలని పోలీసు కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో గురువారం నిర్వహించిన నేరసమీక్ష సమావేశంలో సీపీ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ,

Published : 28 Jan 2022 05:14 IST

సమీక్షలో మాట్లాడుతున్న సీపీ

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం కృషి చేయాలని పోలీసు కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో గురువారం నిర్వహించిన నేరసమీక్ష సమావేశంలో సీపీ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాలపై విశ్లేషించి ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గించేందుకు క్షేత్రస్థాయిలో దృష్టిసారించాలన్నారు. ఖమ్మం గ్రామీణ మండలం, కొణిజర్ల, వైరా ప్రాంతాల్లో వేగ నియంత్రికలు, సూచికబోర్డులు ఏర్పాటు చేయాలని, వివిధ గ్రామాలు, ప్రాంతాల నుంచి అనుసంధానం చేసే రోడ్లపై అవసరమైన వేగ నియంత్రికలు నిర్మించాలన్నారు. నేరనియంత్రణ కోసం గ్రామస్థాయి నుంచే చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోందని తెలిపారు. పోక్సో యాక్టు, క్రైమ్‌ ఎగినెస్ట్‌ ఉమెన్‌, ఎస్సీ, ఎస్టీ, గ్రెవ్‌ కేసుల్లో విచారణ వేగవంతం చేసి ఛార్జ్‌షీట్‌ సకాలంలో దాఖలు చేసేలా పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అనంతరం పోలీసు స్టేషన్ల వారీగా పలు నేరాలపై సమీక్ష నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని