logo

బిడ్డ పుట్టిన ఆనందం.. తల్లికి ప్రాణాపాయం

నిరుపేద కుటుంబమైనా దంపతులు రెక్కల కష్టమ్మీద ఆధారపడి తోడూనీడగా కాపురం చేశారు. తాము తల్లిదండ్రులం అవుతున్నామని ఎంతో ఆనందించారు. బిడ్డకు జన్మనివ్వగానే తల్లి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.

Published : 27 Jan 2023 02:47 IST

దాతల సాయం కోసం చూస్తున్న ఎక్కిరాల శివజ్యోతి

తల్లాడ, న్యూస్‌టుడే:   నిరుపేద కుటుంబమైనా దంపతులు రెక్కల కష్టమ్మీద ఆధారపడి తోడూనీడగా కాపురం చేశారు. తాము తల్లిదండ్రులం అవుతున్నామని ఎంతో ఆనందించారు. బిడ్డకు జన్మనివ్వగానే తల్లి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. రెండు కిడ్నీలు చెడిపోయాయని తెలిసి భర్త బోరున విలపించారు. భార్యను ఎలా కాపాడుకోవాలో తెలియక అసహాయ స్థితిలో దాతల సాయం కోసం అర్థిస్తున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. తల్లాడ మండలం వెంగన్నపేట(గూడూరు) గ్రామానికి చెందిన ఎక్కిరాల శివజ్యోతి వారం రోజుల క్రితం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో బాబుకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టగానే తల్లి శివజ్యోతి రెండు కిడ్నీలు పనిచేయడం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శివజ్యోతికి డయాలసిస్‌ జరుగుతోంది. కనీసం ఆమె తన బాబుకు పాలు ఇచ్చే స్థితిలో కూడా లేదు. శివజ్యోతి భర్త రామారావు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తాను కూడా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆమెను వైద్యులు ప్రైవేట్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేస్తున్నారు. నిరుపేద కుటుంబం కావడంతో వైద్యం అందించలేక దిక్కుతోచని స్థితిలో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు స్పందించి వైద్యచికిత్సలకు ఆర్థికసాయం అందించాలని శివజ్యోతి భర్త రామారావు కోరుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని