logo

స్వేచ్ఛగా ఓటేసే వాతావరణం కల్పించాలి: ఎస్పీ

లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించేందుకు పోలీసులు  కృషిచేయాలని ఎస్పీ బి.రోహిత్‌రాజు సూచించారు.

Published : 02 May 2024 06:22 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రోహిత్‌రాజు
కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించేందుకు పోలీసులు  కృషిచేయాలని ఎస్పీ బి.రోహిత్‌రాజు సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్నికల బందోబస్తుపై స్థానిక ఐఎంఐ హాల్‌లో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఎస్పీ  మాట్లాడుతూ ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. చెక్‌పోస్టుల్లో అధికారులు, సిబ్బంది నిఘా పటిష్ఠం చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సామాన్య ప్రజానీకానికి, శాంతిభద్రతలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలు, ఎన్నికల రూట్ మ్యాప్‌పై అధికారులు, సిబ్బందికి ముందుగానే   అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ ఆపరేషన్స్‌    టి.సాయిమనోహర్‌, భద్రాచలం ఏఎస్పీ పరితోశ్‌ పంకజ్‌, డీఎస్పీలు రెహ్మాన్‌, సతీశ్‌కుమార్‌, రవీందర్‌రెడ్డి, చంద్రభాను, శిక్షణ ఐపీఎస్‌ విక్రాంత్‌ సింగ్‌, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని